Hyderabad, Mar 27: రామకృష్ణ మిషన్ (Ramakrishna Mission) అధ్యక్షుడు స్వామి స్మరణానంద మహారాజ్ (95) (Swami Smaranananda Maharaj) మంగళవారం రాత్రి శివైక్యం చెందారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన తుది శ్వాస విడిచారు. రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ -బేలూరు మఠం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కోల్ కతాలోని రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్ఠాన్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి 8:14 గంటల సమయంలో స్మరణానంద మహాసమాధికి చేరుకున్నారని, తీవ్ర విచారంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని బేలూరు మఠం పేర్కొంది. స్వామి స్మరణానంద యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో జనవరి 29న దవాఖానలో చేరారు.
IPL CSK vs GT: చెపాక్ స్టేడియంలో చెన్నైకి భారీ విజయం..చిత్తుగా ఓడిన గుజరాత్ టైటాన్స్..
With deep sorrow we announce the passing away of Swami Smarananandaji, President of the Ramakrishna Math and Ramakrishna Mission, on Tuesday, 26 March 2024 at 8:14 pm at Ramakrishna Mission Seva Pratishthan hospital, Kolkata. He was 94. #belurmath pic.twitter.com/iFpHugQBA8
— Ramakrishna Math & Ramakrishna Mission, Belur Math (@rkmbelurmath) March 26, 2024
Srimat Swami Smaranananda ji Maharaj, the revered President of Ramakrishna Math and Ramakrishna Mission dedicated his life to spirituality and service. He left an indelible mark on countless hearts and minds. His compassion and wisdom will continue to inspire generations.
I had… pic.twitter.com/lK1mYKbKQt
— Narendra Modi (@narendramodi) March 26, 2024
ఎంతోమందిపై చెరగని ముద్ర
స్మరణానందకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. స్మరణానంద మహారాజ్ తన జీవితాన్ని ఆధ్యాత్మికత, సేవలకు అంకితం చేశారని గుర్తుచేశారు. ఎంతోమంది హృదయాలు, మనస్సులపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. 2020లో తాను బేలూరు మఠాన్ని సందర్శించానని ప్రధాని గుర్తుచేసుకున్నారు.