Viral Video: వీడియో ఇదిగో, హాస్టల్‌లోకి అనుమతించని యాజమాన్యం, తండ్రి భుజంపైకి ఎక్కి కిటికీలొంచి అక్కల చేత రాఖీ కట్టించుకున్న బాలుడు
రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు.అయితే అక్కలతో రాఖీ కట్టించుకుందామని వచ్చిన బాలుడికి నిరాశే ఎదురైంది. తండ్రితో పాటు వచ్చిన బాలుడ్ని హాస్టల్ లోకి అనుమతించలేదు. దాంతో తండ్రి భుజం ఎక్కి, హాస్టల్ కిటీకి నుంచి అక్కలతో రాఖీ కట్టించుకుకోవాల్సి వచ్చింది.
రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు.అయితే అక్కలతో రాఖీ కట్టించుకుందామని వచ్చిన బాలుడికి నిరాశే ఎదురైంది. తండ్రితో పాటు వచ్చిన బాలుడ్ని హాస్టల్ లోకి అనుమతించలేదు. దాంతో తండ్రి భుజం ఎక్కి, హాస్టల్ కిటీకి నుంచి అక్కలతో రాఖీ కట్టించుకుకోవాల్సి వచ్చింది. మంచిర్యాల జిల్లా రామక్రిష్ణ పూర్ లో జరిగిన ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. కనీసం రాఖీ కట్టించుకోవడానికి బాలుడ్ని అనుమతించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువవెత్తుతున్నాయి. దారుణం, అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్తానని చెప్పిన భార్య ముక్కు కోసేసిన భర్త, వీడియో ఇదిగో..
దాసరి అశ్విక, సహస్ర అనే బాలికలు మంచిర్యాల జిల్లా రామక్రిష్ణాపూర్ సోషల్ వేల్పేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. రక్షా బంధన్ సందర్భంగా తండ్రి తన కుమారుడ్ని తీసుకుని హాస్టల్ కు వెళ్లాడు.అయితే రాఖీ కట్టించుకునేందుకు బాలుడు జితేంద్రను ఆ స్కూల్ మేనేజ్ మెంట్ లోపలకి అనుమతించలేదు. దాంతో హాస్టల్ వెనుక వైపు వెళ్లి.. తండ్రి తన కుమారుడు జితేంద్రను భుజాలపై ఎత్తుకున్నాడు. దాంతో కిటికీ నుంచే ఆ బాలికలు తమ సోదరుడు జితేంద్రకు రాఖీ కట్టారు. అనంతరం తండ్రి తెచ్చిన స్వీట్లను తమ్ముడికి తినిపించారు. అయితే రాఖీ కట్టించుకోవడానికి బాలుడ్ని ఎందుకు అనుమతించలేదంటూ స్కూల్ మేనేజ్ మెంట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)