Asian Games 2023: ఆసియా క్రీడ‌ల్లో భారత్ సరికొత్త రికార్డు, 71 మెడ‌ల్స్‌తో పాత రికార్డును బద్దలు కొట్టిన అథ్లెట్ల బృందం

ఆసియా క్రీడ‌ల్లో(Asian Games) భార‌త క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. హాంగ్జూలో జ‌రుగుతున్న గేమ్స్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా 71 ప‌త‌కాల‌ను కైవ‌సం చేసుకున్నది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఆసియా క్రీడ‌ల్లో ఇండియాకు అత్య‌ధిక సంఖ్య‌లో ప‌త‌కాలు రావ‌డం ఇదే మొద‌టిసారి.

India Gets Gold In Archery (PIC@ SAI X)

ఆసియా క్రీడ‌ల్లో(Asian Games) భార‌త క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. హాంగ్జూలో జ‌రుగుతున్న గేమ్స్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా 71 ప‌త‌కాల‌ను కైవ‌సం చేసుకున్నది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఆసియా క్రీడ‌ల్లో ఇండియాకు అత్య‌ధిక సంఖ్య‌లో ప‌త‌కాలు రావ‌డం ఇదే మొద‌టిసారి. ఇవాళ ఆర్చ‌రీ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఇండియా త‌న ఖాతాలో ఓ గోల్డ్ మెడ‌ల్ వేసుకున్న‌ది. దీంతో ఇండియా మెడ‌ల్ ట్యాలీ పెరిగిపోయింది.

గ‌తంలో భార‌త్ ఆసియా క్రీడ‌ల్లో అత్య‌ధికంగా 70 ప‌త‌కాల‌ను గెలుచుకున్న‌ది. ఇప్పుడు ఆ రికార్డును అథ్లెట్ల బృందం బ్రేక్ చేసింది. జ‌క‌ర్తాలో 2018లో జ‌రిగిన ఆసియా క్రీడ‌ల్లో ఇండియా 70 మెడ‌ల్స్ గెలుచుకున్న‌ది. ఆ ఏడాది 16 స్వ‌ర్ణాలు, 23 సిల్వ‌ర్, 31 కాంస్య ప‌త‌కాల‌ను ఆ బృందం త‌న ఖాతాలో వేసుకున్న‌ది. ఈసారి ఇప్ప‌టికే 16 గోల్డ్‌, 26 సిల్వ‌ర్, 29 కాంస్య ప‌త‌కాల‌ను ఇండియా గెలుచుకున్న విష‌యం తెలిసిందే. ఇవాళ ఉద‌యం 35 కిలోమీట‌ర్ల మిక్స్‌డ్ రేస్ వాక్ ఈవెంట్‌లో భార‌త్‌కు కాంస్య ప‌త‌కం వ‌చ్చింది. మంజూ రాణి, రామ్ బాబూ ఆ మెడ‌ల్‌ను గెలుచుకున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement