Asian Games 2023: ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ పతకాల పంట, జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు స్వర్ణం, రజత పతకం సాధించిన కిషోర్ జెనా
జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. ఇదే ఈవెంట్‌లో కిషోర్ జెనా రజత పతకం నెగ్గాడు. గత ఏషియన్ గేమ్స్‌లో ఇదే ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన నీరజ్.. ఈసారి జావెలిన్‌ను 88.88 మీటర్లు విసిరి స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు
ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. ఇదే ఈవెంట్‌లో కిషోర్ జెనా రజత పతకం నెగ్గాడు. గత ఏషియన్ గేమ్స్‌లో ఇదే ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన నీరజ్.. ఈసారి జావెలిన్‌ను 88.88 మీటర్లు విసిరి స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ ఈవెంట్‌లో రజతం సాధించిన కిషోర్ 87.54 మీటర్లు జావెలిన్‌ను విసిరి, నీరజ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఈ ప్రదర్శనతో నీరజ్, కిషోర్ ఇద్దరు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)