Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన ప్రాచీకి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, యావత్ దేశం గర్వించేలా చేసిందంటూ ట్వీట్
ఆసియా పారా గేమ్స్‌లో తొలి పతకాన్ని సాధించడం ద్వారా భారత క్రీడా చరిత్రలో ప్రాచీ యాదవ్ తన పేరును నిలబెట్టుకుంది.పారా కానోయింగ్ మహిళల VL2 ఫైనల్‌లో తకం సాధించడం ద్వారా ఆమె అద్భుతమైన ప్రదర్శన యావత్ దేశం గర్వించేలా చేసిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
పారా ఆసియా క్రీడలులో మహిళల VL2 కెనోయింగ్ ఫైనల్ లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. హాంగ్‌జౌలో సోమవారం జరుగుతున్న 4వ ఆసియా క్రీడలలో భారతదేశం తన ఖాతాను తెరిచింది.ప్రాచీ.. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఇరోదాఖోన్ రుస్తమోవాకు 1.022 సెకన్ల తేడాతో బంగారు పతకం మిస్ చేసుకుంది. ప్రాచీ 1:03.47 సెకన్లతో రజత పతకాన్ని ఖాయం చేసుకోగా, ఇరోదాఖోన్ 1:02.125 సెకన్లతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.జపాన్ క్రీడాకారిణి సాకి కొమట్సు 1:11.635 సెకన్లతో కాంస్య పతకంతో నిష్క్రమించింది. భారతదేశానికి తొలి పతకాన్ని అందించిన ప్రాచీ యాదవ్ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఆసియా పారా గేమ్స్‌లో తొలి పతకాన్ని సాధించడం ద్వారా భారత క్రీడా చరిత్రలో ప్రాచీ యాదవ్ తన పేరును నిలబెట్టుకుంది.పారా కానోయింగ్ మహిళల VL2 ఫైనల్‌లో తకం సాధించడం ద్వారా ఆమె అద్భుతమైన ప్రదర్శన యావత్ దేశం గర్వించేలా చేసిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Here's PM Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)