Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్ 2023, పురుషుల T63 హైజంప్‌లో బంగారు పతకం కైవసం చేసుకున్న భారత ఆటగాడు శైలేష్ కుమార్

పురుషుల T63 హైజంప్‌లో శైలేష్ కుమార్ స్వర్ణం సాధించి, ఆసియా పారా గేమ్స్ 1.82 మీటర్ల రికార్డును నెలకొల్పాడు, ఆసియన్ పారా గేమ్స్ 2023లో భారత్‌కు రజత పతకాన్ని అందించిన మరో భారత ఆటగాడు మరియప్పన్ తంగవేలు (1.80 మీటర్లు) కంటే ముందున్నాడు.

Sailesh Kumar Wins Gold Medal

చైనాలో ఆసియా క్రీడలు ముగిసిన రెండు వారాల తర్వాత హాంగ్‌జౌలో మళ్లీ ఆటల సందడి మొదలైంది. పారా ఆసియా క్రీడలు షురూ అయ్యాయి. ఆదివారం హాంగ్‌జౌ ఒలింపిక్‌ స్పోర్ట్స్‌ సెంటర్‌ స్టేడియంలో ఈ క్రీడల ఆరంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చైనా ఉపాధ్యక్షుడు డింగ్‌ గ్జూజియాంగ్‌ క్రీడలు మొదలైనట్లు ప్రకటించారు.భారత్‌ తరఫున 313 అథ్లెట్లు బరిలో ఉన్నారు.

పురుషుల T63 హైజంప్‌లో శైలేష్ కుమార్ స్వర్ణం సాధించి, ఆసియా పారా గేమ్స్ 1.82 మీటర్ల రికార్డును నెలకొల్పాడు, ఆసియన్ పారా గేమ్స్ 2023లో భారత్‌కు రజత పతకాన్ని అందించిన మరో భారత ఆటగాడు మరియప్పన్ తంగవేలు (1.80 మీటర్లు) కంటే ముందున్నాడు. సోమవారం హాంగ్‌జౌలో జరుగుతున్న 4వ ఆసియా పారా గేమ్స్ 2022లో పురుషుల హైజంప్ T47లో భారత ఆటగాడు నిషాద్ కుమార్ కొత్త ఆసియా క్రీడల రికార్డును నెలకొల్పుతూ స్వర్ణం సాధించాడు. నిషాద్ తన మిగిలిన పోటీదారుల కంటే ఎక్కువగా దూకి 2.02 మీటర్ల ఎత్తుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

Sailesh Kumar Wins Gold Medal

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement