PV Sindhu Dance Video: డ్యాన్స్ వేసి అదరగొట్టిన పీవీ సింధు, పాప్ సింగర్ సీకే పాడిన 'లవ్ వాంటిటి' సాంగ్‌కు చిందేలేసిన బ్యాడ్మింటన్ స్టార్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సంప్రదాయ దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పాప్ సింగర్ సీకే పాడిన 'లవ్ వాంటిటి' సాంగ్‌కు సింధు చిందులేసింది. కొన్ని రోజులుగా ఈ పాట ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతోంది.
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సంప్రదాయ దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పాప్ సింగర్ సీకే పాడిన 'లవ్ వాంటిటి' సాంగ్‌కు సింధు చిందులేసింది. కొన్ని రోజులుగా ఈ పాట ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతోంది. కాంచీపురం లెహెంగాలో పీవీ సింధు ఈ పాప్ సాంగ్‌కు చేసిన డ్యాన్స్ అలరిస్తోంది. ఆమె డ్యాన్సును ఇప్పటికే లక్షలాది మంది చూశారు.
ట్రెడిషనల్, డ్యాన్స్, లవ్, మ్యూజిక్, డ్యాన్స్‌లవ్ హ్యాష్‌ట్యాగ్‌లను సింధు జోడించింది. ఆమె ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన తీరుపై ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. బ్యాడ్మింటన్‌తో బిజీగా ఉండే సింధు డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి కూడా గురిచేస్తోంది. సింధు నిన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ భూషణ్ అందుకున్న విషయం తెలిసిందే
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)