T20 World Cup 2022: టీమిండియాకీ మరో భారీ షాక్, నెట్ ప్రాక్టీస్‌లో గాయపడిన విరాట్ కోహ్లీ, నిన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు గాయం

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా ఇంగ్లండ్‌తో రేపు (నవంబర్‌ 10) జరగబోయే కీలక సెమీస్‌ సమరానికి ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది.ఫామ్‌లో ఉన్న కింగ్‌ కోహ్లి గాయపడినట్లు తెలుస్తోంది. నెట్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో కోహ్లి గాయపడ్డాడని బీసీసీఐ వర్గాల సమాచారం.

virat-kohli-1

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా ఇంగ్లండ్‌తో రేపు (నవంబర్‌ 10) జరగబోయే కీలక సెమీస్‌ సమరానికి ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది.ఫామ్‌లో ఉన్న కింగ్‌ కోహ్లి గాయపడినట్లు తెలుస్తోంది. నెట్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో కోహ్లి గాయపడ్డాడని బీసీసీఐ వర్గాల సమాచారం. అయితే కోహ్లికి ఎక్కడ గాయమైంది, దాని తీవ్రత ఏంటి, రేపటి మ్యాచ్‌కు కోహ్లి అందుబాటులో ఉంటాడా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. కాగా, నిన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా గాయపడిన విషయం తెలిసిందే. అయితే హిట్‌మ్యాన్‌కు తగిలిన గాయం చిన్నది కావడంతో అతను తిరిగి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now