Hardik Pandya Hugs Umpire: వీడియో ఇదిగో, అంపైర్‌ను కౌగిలించుకుని పడిపడి నవ్విన హార్దిక్‌ పాండ్యా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం

ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంపైర్‌ను హగ్ చేసుకొని నవ్వులు పూయించాడు. నేపాల్‌ ఇన్నింగ్స్‌ 34 ఓవర్‌ ఆఖరిలో వర్షం ఒక్కసారిగా కురిసింది.

Hardik Pandya Hugs Umpire

ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంపైర్‌ను హగ్ చేసుకొని నవ్వులు పూయించాడు. నేపాల్‌ ఇన్నింగ్స్‌ 34 ఓవర్‌ ఆఖరిలో వర్షం ఒక్కసారిగా కురిసింది. దీంతో వెంటనే గ్రౌండ్‌ స్టాప్‌ కవర్లు తీసుకుని మైదానంలోకి వచ్చారు. అంపైర్‌లు కూడా స్టంప్స్‌ను తొలిగించారు. కానీ వర్షం మాత్రం ఆగిపోయింది. ఈ క్రమంలో కవర్లు తీసుకుని వచ్చిన గ్రౌండ్‌ స్టాప్‌ కూడా మైదానం మధ్యలో ఆగిపోయారు.

దీంతో మళ్లీ వారు వెనక్కి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఇది చూసిన హార్దిక్‌ పాండ్యా గట్టిగా నవ్వుకున్నాడు. ఈ క్రమంలో హార్దిక్‌ పక్కనే ఉన్న అంపైర్‌ను నవ్వుతూ ‍కౌగిలించుకున్నాడు. వర్షం దాగుడు మూతలు ఆడుతుందని చెబుతూ పడి పడి నవ్వాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఆసియాకప్‌-2023లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సూపర్‌-4కు భారత అర్హత సాధించింది.

Hardik Pandya Hugs Umpire

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement