IPL 2022: ఆండ్రీ రసెల్ విధ్వంసం, పంజాబ్‌పై ఘన విజయం సాధించిన కేకేఆర్, 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన కోలకతా నైట్ రైడర్స్
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆండ్రీ రసెల్ (31 బంతుల్లో 70, 2 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో కేకేఆర్ 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. 51 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రసెల్ మెరుపులు మెరిపించాడు.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆండ్రీ రసెల్ (31 బంతుల్లో 70, 2 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో కేకేఆర్ 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. 51 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రసెల్ మెరుపులు మెరిపించాడు. సిక్సర్ల వర్షంతో లక్ష్యం చిన్నదిగా మారిపోయింది. అతనికి తోడుగా సామ్ బిల్లింగ్స్ కూడా 24 పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చహర్ 2 వికెట్లు, కగిసో రబాడ, ఓడియన్ స్మిత్ తలా ఒక వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 137 పరుగుల వద్ద ఆలౌటైంది. బానుక రాజపక్స 31 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చివర్లో రబాడ 16 బంతుల్లో 25 రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4, సౌథీ 2, శివమ్ మావి, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ తలా ఒక వికెట్ తీశారు.