APL 2022: జూలై 6 నుంచి 17 వరకు ఏపీఎల్ 2022, విశాఖ YSR స్టేడియంలో జూలై 17న ఫైనల్, సీఎం జగన్‌ను ఆహ్వానించిన ఏసీఏ బృందం
జూలై 6 నుంచి 17 వరకు విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నమెంట్‌ను ఏసీఏ నిర్వహించనుంది. జూలై 17న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు సీఎం వైఎస్ జగన్‌ను ఏసీఏ బృందం ఆహ్వానించింది.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) టీ–20 టోర్నమెంట్ లోగోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం సీఎం నివాసంలో సీఎం వైఎస్ జగన్‌ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రెసిడెంట్ పి.శరత్‌చంద్రారెడ్డి, ట్రెజరర్ గోపినాథ్‌రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సత్యప్రసాద్, సభ్యులు ప్రసాద్, గోపాలరాజు, టెక్నికల్ ఇన్‌చార్జ్ విష్ణు దంతుతో పాటు.. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలిశారు.
ల్యాప్‌టాప్‌లో ఏపీఎల్ టీ–20 టీజర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. జూలై 6 నుంచి 17 వరకు విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నమెంట్‌ను ఏసీఏ నిర్వహించనుంది. జూలై 17న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు సీఎం వైఎస్ జగన్‌ను ఏసీఏ బృందం ఆహ్వానించింది. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని సీఎం జగన్‌కు ఏసీఏ ప్రెసిడెంట్ పి.శరత్‌చంద్రారెడ్డి వివరించారు. టీ–20 టోర్నమెంట్ నిర్వహించుకునేందుకు బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నట్టు వెల్లడించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)