Arun Lal Marriage: 66 ఏళ్ళ వయసులో 28 ఏళ్ళ మహిళతో పెళ్లి, బుల్ బుల్ సాహాతో మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ వివాహం, వైరల్ అవుతున్న పెళ్ళి ఫోటోలు

భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ లేటు వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. 66 ఏళ్ల అరుణ్ లాల్ 28 ఏళ్ల ఉపాధ్యాయని బుల్ బుల్ సాహాను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి అరుణ్ లాల్ మొదటి భార్య రీనా అంగీకారం తెలపడం విశేషం. రీనా చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.

Arun Lal Marriage

భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ లేటు వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. 66 ఏళ్ల అరుణ్ లాల్ 28 ఏళ్ల ఉపాధ్యాయని బుల్ బుల్ సాహాను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి అరుణ్ లాల్ మొదటి భార్య రీనా అంగీకారం తెలపడం విశేషం. రీనా చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. కొంతకాలం కిందట అరుణ్ లాల్, రీనా విడాకులు తీసుకున్నప్పటికీ కలిసే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, అరుణ్ లాల్ కు సాహాతో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. వీరి ప్రేమను రీనా కూడా ప్రోత్సహించింది. దాంతో తన వయసులో సగం ఉన్న బుల్ బుల్ సాహాతో అరుణ్ లాల్ నిశ్చితార్థం గత నెలలో జరిగింది.

తాజాగా వీరి పెళ్లి మే 2న కోల్ కతాలో జరిగింది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు. తమ పెళ్లి ఫొటోలను బుల్ బుల్ సాహా తన ఫేస్ బుక్ అకౌంట్ లో పంచుకోవడంతో వైరల్ అయ్యాయి. అరుణ్ లాల్ 80వ దశకంలో భారత జట్టులో సభ్యుడు. 1989లో వెస్టిండీస్ పై తన కెరీర్ చివరి టెస్టు ఆడిన ఈ బెంగాలీ ఆటగాడు ఆపై ఆటకు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం అరుణ్ లాల్ బెంగాల్ రంజీ టీమ్ కు ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement