Asia Cup 2023: వీడియో ఇదిగో, 2 బంతుల్లో 6 రన్స్ కొట్టి పాకిస్తాన్‌ను ఇంటికి సాగనంపిన అసలంక, కెప్టెన్ బాబర్ ఆజం రియాక్షన్ చూశారా..
శ్రీలంక ఘన విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో.. ఆఖరి బంతికి అసలంక రెండు పరుగులు చేసి శ్రీలంకను ఫైనల్ కు చేర్చాడు . 253 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక.. చివరి ఓవర్‌లో 8 రన్స్ అవసరం కాగా.. ఆ టార్గెట్‌ను అందుకున్నది
పాకిస్థాన్‌తో జరిగిన ఆసియాకప్(Asian Cup) మ్యాచ్‌లో.. శ్రీలంక ఘన విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో.. ఆఖరి బంతికి అసలంక రెండు పరుగులు చేసి శ్రీలంకను ఫైనల్ కు చేర్చాడు . 253 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక.. చివరి ఓవర్‌లో 8 రన్స్ అవసరం కాగా.. ఆ టార్గెట్‌ను అందుకున్నది. జమన్ ఖాన్ వేసిన ఆ ఓవర్‌లో అయిదో బంతికి ఫోర్, ఆరో బంతికి రెండు రన్స్ తీసిన అసలంక.. శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం శ్రీలంక గెలుపొంది ఫైనల్లోకి ప్రవేశించింది. అసలంక 49 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఫైనల్ ఓవర్‌కు చెందిన వీడియో ఇదిగో..
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ షఫిక్ 52, రిజ్వాన్ 86 రన్స్ చేశారు. అయితే భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంకకు మెండిస్, అసలంక బాసటగా నిలిచారు. మెండిస్ 91, సదీర 48, అసలంక 49 రన్స్ చేశారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో శ్రీలంక రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)