Asian Games 2023: టీ20ల్లో అత్యంత చెత్త రికార్డు, మొన్న 15 పరుగులకే ఆలౌట్, నేడు 22 పరుగులకే కుప్పకూలింది, ఏషియన్ గేమ్స్-2023 నుంచి ఇంటిదారి పట్టిన మంగోలియా
వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన మంగోలియా.. టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది
చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్-2023లో మంగోలియా మహిళల క్రికెట్ జట్టు మరోసారి అత్యంత చెత్త ప్రదర్శన నమోదు చేసింది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన మంగోలియా.. టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది
బుధవారం హాంకాంగ్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఏకంగా 180 పరుగుల తేడాతో మంగోలియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.హాంకాంగ్ బ్యాటర్లలో కెప్టెన్ కారీ చాన్ (70) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. యీ షాన్ టోనోట్(34 నాటౌట్),మర్యం బీబీ(30) పరుగులతో రాణించారు. కాగా మంగోలియన్ బౌలర్లు ఏకంగా 36 పరుగులు ఎక్స్‌ట్రాస్‌గా ఇచ్చారు.
అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మంగోలియా 12.4 ఓవర్లలో కేవలం 22 పరుగులకే కుప్పకూలింది. హాంకాంగ్ బౌలర్లలో అలిసన్ సియు, కానీ చాన్ తలా రెండు వికెట్లు సాధించగా.. బీబీ, యూసఫ్, అమండా చెయుంగ్ చెరో వికెట్ సాధించారు. కాగా అంతకుముందు మ్యాచ్‌లో కూడా ఇండోనేషియాపై మంగోలియా ఈ తరహా ప్రదర్శనే చేసింది. ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా కేవలం 15 పరుగులకే ఆలౌటైంది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా మంగోలియా చెత్త రికార్డు నెలకొల్పింది.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)