T20 World Cup 2022: కళ్లు చెదిరే ఫీల్డింగ్ వీడియో వైరల్, వెనక్కి ఎగిరి ఎడమ చేతితో బంతి సిక్స్ పోకుండా ఆపిన ఐర్లాండ్ ఫీల్డర్ బారీ మెక్‌కార్తి
బౌండరీ లైన్ వద్ద గాలిలో బంతిని పట్టి సిక్సర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు.విషయంలోకి వెళ్తే 15వ ఓవర్‌లో స్టోయినిస్ లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఫీల్డర్ బారీ మెక్‌కార్తి అద్భుతమైన ఫీల్డింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. బౌండరీ లైన్ వద్ద గాలిలో బంతిని పట్టి సిక్సర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు.విషయంలోకి వెళ్తే 15వ ఓవర్‌లో స్టోయినిస్ లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. అయితే ఆ బంతి దాదాపు బౌండరీ లైన్ దాటబోయింది. ఆ సమయంలో వెనక్కి ఎగిరి ఎడమ చేతితో బంతిని పట్టాడు మెక్‌కార్తి. కానీ బౌండరీ లైన్ బయట పడిపోవడాన్ని గమనించి అతను.. తన చేతిలో ఉన్న బంతిని గ్రౌండ్‌లోకి విసిరేశాడు. దీంతో మెక్‌కార్తి ఒకరకంగా సిక్సర్‌ను ఆపేశాడు.ఈ ఫీల్డింగ్ స్టంట్ వీడియో వైరల్ అవుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)