Warne's Body Arrives in Melbourne: ఆస్ట్రేలియాకు చేరుకున్న షేన్‌వార్న్‌ మృతదేహం, ఈనెల 30న మెల్‌బోర్న్‌ స్టేడియంలో వార్న్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిక నివాళి కార్యక్రమం

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ మృతదేహం ఆస్ట్రేలియా చేరింది. గుండెపోటుతో గత శుక్రవారం థాయ్‌లాండ్‌లో వార్న్‌ (52) మరణించిన సంగతి తెలిసిందే. బ్యాంకాక్‌ నుంచి వార్న్‌ మృతదేహంతో గురువారం ఉదయం బయలుదేరిన ప్రైవేట్‌ విమానం రాత్రి 8.30కి మెల్‌బోర్న్‌ చేరుకుంది

Shane Warne (Photo Credits: Instagram)

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ మృతదేహం ఆస్ట్రేలియా చేరింది. గుండెపోటుతో గత శుక్రవారం థాయ్‌లాండ్‌లో వార్న్‌ (52) మరణించిన సంగతి తెలిసిందే. బ్యాంకాక్‌ నుంచి వార్న్‌ మృతదేహంతో గురువారం ఉదయం బయలుదేరిన ప్రైవేట్‌ విమానం రాత్రి 8.30కి మెల్‌బోర్న్‌ చేరుకుంది. శవపేటికపై ఆస్ట్రేలియా పతాకాన్ని అలంకరించారు. మృతదేహాన్ని విమానాశ్రయంలో వార్న్‌ తల్లి బ్రిగిటికి అప్పగించారు. అక్కడనుంచి పార్థివదేహాన్ని వార్న్‌ ఇంటికి తరలించారు. కాగా..ఈనెల 30న మెల్‌బోర్న్‌ స్టేడియంలో వార్న్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిక నివాళి కార్యక్రమం జరుగనుంది. ఆ కార్యక్రమానికి ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, విక్టోరియా ప్రభుత్వ వైస్‌ ప్రీమియర్‌ డొనాల్డ్‌ ఆండ్రూస్‌ హాజరుకానున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement