Babar Azam Crying Video: వీడియో ఇదిగో, ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ ఔట్ కావడంతో గుక్కపెట్టి ఏడ్చేసిన కెప్టెన్ బాబర్ ఆజం
ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు కన్నీటి పర్యంతమైనట్లుగా ఉన్న ఫొటో, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
వరుసగా రెండోసారి ఆసియా కప్ ఫైనల్ చేరాలన్న పాకిస్తాన్ ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లింది. గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన టోర్నీలో పాక్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన దసున్ షనక సేన.. ఈసారి ఆ జట్టును కనీసం ఫైనల్ కూడా చేరవనివ్వలేదు. వరణుడి కారణంగా 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో.. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. లంక ఆల్‌రౌండర్ చరిత్ అసలంక ఏమాత్రం తడ‘బ్యా’టుకు లోనుకాలేదు. గెలవాలంటే ఆఖరి బంతికి రెండు పరుగులు రాబట్టాల్సిన తరుణంలో సరిగ్గా 2 రన్స్ తీసి లంకను ఫైనల్‌కు తీసుకెళ్లాడు.
పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు కన్నీటి పర్యంతమైనట్లుగా ఉన్న ఫొటో, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
బాబర్ ఆజం సారథ్యంలో పాకిస్తాన్ టీ20 వరల్డ్‌కప్-2021లో సెమీస్‌లోనే ఇంటిబాట పట్టింది. గతేడాది ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. ఈసారి సూపర్-4 దశలోనే ఆసియా కప్ ప్రయాణాన్ని ముగించింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)