Babar Azam Steps Down: పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం రాజీనామా, అన్ని ఫార్మట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన పాకిస్తాన్ స్టార్ ప్లేయర్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మట్ల క్రికెట్‌లో పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బుధవారం ఆజం వెల్లడించాడు.వన్డే వరల్డ్‌కప్‌లో తమ జట్టు ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

"మూడు ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ నేను తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావించాను. కెప్టెన్సీకి రాజీనామా చేసినప్పటికీ.. మూడు ఫార్మాట్లలోనూ పాకిస్తాన్ ఆటగాడిగా కొనసాగుతానని తెలిపారు. 2019లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆజం.. పాకిస్తాన్‌కు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించాడు. అతడి సారథ్యంలో పాకిస్తాన్ వన్డేల్లో నెం1 జట్టుగా నిలిచింది.
Here's Statement
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)