Mushfiqur Rahim Dismissed Video: వీడియో ఇదిగో, చేతితో బంతిని అడ్డుకుని ఔటైన ముష్ఫికర్‌ రహీం, 11వ ఆటగాడిగా, బంగ్లా తొలి ఆటగాడిగా రికార్డు

ఈ రోజు బంగ్లాదేశ్‌ వెటరన్‌ ఆటగాడు, ఆ జట్టు వికెట్‌కీపర్‌ ముష్ఫికర్‌ రహీం ఓ అరుదైన పద్దతిలో ఔటయ్యాడు. బంతికి చేతితో అడ్డుకుని ముష్ఫికర్‌ పెవిలియన్‌కు చేరాడు.

Mushfiqur Rahim Dismissed Video

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 6) మొదలైన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 50 ఓవర్ల తర్వాత ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.ఈ రోజు బంగ్లాదేశ్‌ వెటరన్‌ ఆటగాడు, ఆ జట్టు వికెట్‌కీపర్‌ ముష్ఫికర్‌ రహీం ఓ అరుదైన పద్దతిలో ఔటయ్యాడు. బంతికి చేతితో అడ్డుకుని ముష్ఫికర్‌ పెవిలియన్‌కు చేరాడు. హ్యాండిల్‌ ద బాల్‌ నిబంధన మేరకు రహీం ఔటైనట్లు అంపైర్లు ప్రకటించారు. జేమీసన్‌ బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న రహాం బంతిని డిఫెన్స్‌ ఆడగా అది కాస్త వికెట్లను ముద్దాడే దిశగా వెళ్లింది. దీంతో అప్రమత్తమైన రహీం బంతి వికెట్లు తాకకుండా అడ్డుకున్నాడు.

టెస్ట్‌ల్లో హ్యాండిల్‌ ద బాల్‌ నిబంధన ద్వారా ఔటైన తొలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌గా రహీం రికార్డుల్లోకెక్కాడు.టెస్ట్‌ల్లో ఓవరాల్‌గా ఈ నిబంధన ద్వారా ఇప్పటివరకు 11 మంది ఔటయ్యారు. రహీం 11వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రహీంకు ముందు మైఖేల్‌ వాన్‌, మహేళ జయవర్ధనే, మర్వన్‌ ఆటపట్టు, స్టీవ్‌ వా, గ్రహం గూచ్‌, డెస్మండ్‌ హేన్స్‌, మొహిసిన్‌ ఖాన్‌, ఆండ్రూ హిల్డిచ్‌, రసెల్‌ ఎండీన్‌, లియోనార్డ్‌ హట్టన్‌ హ్యాండిల్‌ ద బాల్‌ నిబంధన ద్వారా ఔటయ్యారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now