Anil Kumble Meets CM Jagan: సీఎం జగన్ ను కలిసిన భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపిన వైసీపీ పార్టీ

Anil Kumble Meets CM Jagan (Photo-Twitter)

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను భారత్ దిగ్గజ స్పిన్ బౌలర్, మాజీ టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ తో కరచాలనం చేసిన కుంబ్లే... ఆయనకు పుష్పగుచ్ఛాన్ని, జ్ఞాపికను అందించారు. మర్యాదపూర్వకంగానే జగన్ ను టీమిండియా మాజీ కెప్టెన్ కుంబ్లే కలిసినట్టు వైసీపీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)