Sreesanth Booked in Cheating Case: భారత మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌పై ఛీటింగ్ కేసు నమోదు, స్పోర్ట్స్ అకాడమీ పేరుతో రూ.18.70 లక్షలు తీసుకున్నారని ఆరోపణలు
శ్రీశాంత్ తో పాటు రాజీవ్ కుమార్, వెంకటేశ్ కినీ అనే వ్యక్తులపై ఉత్తర కేరళ జిల్లాలో చీటింగ్ కేసు నమోదు చేశారు. సురేశ్ గోపాలన్ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
టీమిండియా మాజీ పేస్ బౌలర్ శ్రీశాంత్ పై ఓ చీటింగ్ కేసు నమోదైంది. శ్రీశాంత్ తో పాటు రాజీవ్ కుమార్, వెంకటేశ్ కినీ అనే వ్యక్తులపై ఉత్తర కేరళ జిల్లాలో చీటింగ్ కేసు నమోదు చేశారు. సురేశ్ గోపాలన్ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొల్లూర్ లో స్పోర్ట్స్ అకాడమీ నెలకొల్పుతామంటూ రాజీవ్ కుమార్, వెంకటేశ్ కినీ తన నుంచి రూ.18.70 లక్షలు తీసుకున్నారని, వారిద్దరితో శ్రీశాంత్ కు కూడా భాగస్వామ్యం ఉందని ఆ వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ అకాడమీలో తాను కూడా భాగస్వామిగా ఉండొచ్చన్న ఉద్దేశంతోనే వారికి డబ్బులు ఇచ్చానని సురేశ్ గోపాలన్ వివరించారు. కానీ వారు స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన పోలీసులను కోరారు. సురేశ్ గోపాలన్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ కేసులో శ్రీశాంత్ ను మూడో నిందితుడిగా పేర్కొన్నారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)