David Warner: వీడియో ఇదిగో, అభిమానుల హృదయాలను మరోసారి పిండేసిన డేవిడ్‌ వార్నర్‌, అతని మంచిమనసును చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌ 32.1 ఓవర్ల వద్ద వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు.

David Warner Shows Heart-Winning Gesture

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌ 32.1 ఓవర్ల వద్ద వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. భారీ గాలులతో కూడిన వర్షం ఒక్కసారిగా రావడంతో ప్లేయర్స్‌ అందరూ డగౌట్‌ వైపు పరుగులు తీశారు.

కానీ డేవిడ్‌ వార్నర్‌ మాత్రం తన మంచిమనసును చాటుకున్నాడు. కవర్‌లను మైదానంలోకి తీసుకువచ్చేందుకు లక్నో గ్రౌండ్‌ స్టాప్‌కు వార్నర్‌ సహాయం చేశాడు. బౌండరీ లైన్‌ దగ్గర నుంచి పిచ్‌ వరకు గ్రౌండ్‌ స్టాప్‌తో పాటు వార్నర్‌ కవర్లను తీసుకువెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఇది చూసిన అభిమానులు వార్నర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

David Warner Shows Heart-Winning Gesture

Here's Video

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు