IND vs SA 3rd T20I: వైరల్ వీడియో, రనౌట్‌ చేస్తానని నవ్వుతూ హెచ్చరించిన దీపక్‌ చాహర్‌, క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడంటూ ప్రశంసలు

ఇండోర్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 49 పరుగుల తేడాతో పరాజాయం పాలైన సంగతి విదితమే. కాగా ఈ మ్యాచ్‌లో భారత పేసర్‌ దీపక్‌ చాహర్‌ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు.

Deepak Chahar

ఇండోర్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 49 పరుగుల తేడాతో పరాజాయం పాలైన సంగతి విదితమే. కాగా ఈ మ్యాచ్‌లో భారత పేసర్‌ దీపక్‌ చాహర్‌ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. సౌతాఫ్రికా ఆటగాడు ట్రిస్టాన్‌ స్టబ్స్‌ను రనౌట్‌(మన్కడింగ్‌) చేసే అవకాశం ఉన్నప్పటికీ.. అఖరి నిమిషంలో తన మనసును చాహర్‌ మార్చుకున్నాడు.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో తొలి బంతి వేయడానికి దీపక్‌ చాహర్‌ సిద్దమయ్యాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న ట్రిస్టాన్ స్టబ్స్.. బౌలర్‌ను గమనించకుండా క్రీజు వదిలి చాలా దూరం ముందుకు వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన చాహర్.. బంతిని వేయకుండా ఆపేసి రనౌట్‌ చేస్తానని నవ్వుతూ హెచ్చరించాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దీపక్‌ క్రీడా స్పూర్తికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement