Akash Deep: ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన జాక్‌ క్రాలే, అంపైర్ నో బాల్ గా ప్రకటించడంతో నిరాశ, ఆ తర్వాత అదే కసితో మూడు వికెట్లు..

నాలుగో ఓవర్లో మరోసారి బాల్‌ అందుకున్న ఆకాశ్‌.. జాక్‌ క్రాలే క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అయితే, అది నోబాల్‌గా తేలడంతో ఆకాశ్‌ దీప్‌నకు నిరాశ తప్పలేదు. పదో ఓవర్లో ఏకంగా రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

Drama! Akash Deep Denied Maiden Wicket As He Bowls Zak Crawley Off a No-Ball During IND vs ENG 4th Test 2024, Video Goes Viral

టీమిండియా బౌలర్‌ ఆకాశ్‌ దీప్‌ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ బెంగాల్‌ పేసర్‌ మూడు వికెట్లతో మెరిసాడు. తన తొలి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన ఈ రైటార్మ్‌ పేసర్‌.. కేవలం రెండు పరుగులే ఇచ్చాడు.ఈ క్రమంలో నాలుగో ఓవర్లో మరోసారి బాల్‌ అందుకున్న ఆకాశ్‌.. జాక్‌ క్రాలే క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అయితే, అది నోబాల్‌గా తేలడంతో ఆకాశ్‌ దీప్‌నకు నిరాశ తప్పలేదు. పదో ఓవర్లో ఏకంగా రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.ఆకాశ్‌దీప్‌ 3 వికెట్లతో విజృంభించగా.. సిరాజ్‌ 2, రవీంద్ర జడేజా, అశ్విన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (42), బెన్‌ డకెట్‌ (11), ఓలీ పోప్‌ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్‌ స్టోక్స్‌ (3), బెన్‌ ఫోక్స్‌(47), టామ్‌ హార్ట్లీ (13) ఔట్‌ కాగా.. రూట్‌ (106), రాబిన్సన్‌ (31) క్రీజ్‌లో ఉన్నారు.  వీడియో ఇదిగో, జానీ బెయిర్‌ స్టో‌ని వెనక్కి పంపిన అశ్విన్, ఇంగ్లండ్‌పై 100 టెస్టు వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా రికార్డు

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now