Dunith Wellalage: లంక క్రికెట్‌కు దునిత్ రూపంలో మరో మిస్టరీ స్పిన్నర్, భారత టాప్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన శ్రీలంక యువ స్పిన్నర్
కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించి సత్తా చాటాడు. పట్టుమని 15 మ్యాచ్‌లు కూడా ఆడని 20 ఏళ్ల వెల్లలగేను ఎదుర్కొనేందుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు.
ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే చెలరేగిపోయాడు. కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించి సత్తా చాటాడు. పట్టుమని 15 మ్యాచ్‌లు కూడా ఆడని 20 ఏళ్ల వెల్లలగేను ఎదుర్కొనేందుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా ఇలా అందరూ అతని స్పిన్ వలలో పడ్డారు. రోహిత్, గిల్ క్లీన్‌బౌల్డ్‌లు కాగా.. కోహ్లి షనకకు, హార్దిక్ కుశాల్ మెండిస్‌కు క్యాచ్‌లు ఇచ్చి పెవిలియన్ బాట పట్టారు. కేఎల్ రాహుల్‌ను అయితే వెల్లలగేనే క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు.ఈ నేపథ్యంలో లంక క్రికెట్‌కు మరో మిస్టరీ స్పిన్నర్ దొరికాడని నెట్టింట కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)