Joe Root Dismissal Video: జో రూట్ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, ఫిలిప్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడి భారీ మూల్యం చెల్లించుకున్న ఇంగ్లండ్ ఆటగాడు
గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ మరోసారి అదే ప్రయత్నం చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రూట్ అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఫిలిప్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
2023 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన బట్లర్ సేన ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వస్తుంది. ఈ ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచి క్రమం తప్పకుండా రివర్స్ స్వీప్ షాట్లు ఆడి సక్సెస్ సాధించిన రూట్.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ మరోసారి అదే ప్రయత్నం చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రూట్ అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఫిలిప్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్ 229 పరుగుల వద్ద (41.1 ఓవర్లు) ఏడో వికెట్ కోల్పోయింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)