Glenn Maxwell Fastest Century in CWC: వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ, 40 బంతుల్లోనే సెంచరీ చేసి కొత్త రికార్డు నెలకొల్పిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌

వన్డే వరల్డ్‌కప్‌-2023లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. డచ్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్న మాక్సీ కేవలం 40 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు

Glenn Maxwell (photo-X)

వన్డే వరల్డ్‌కప్‌-2023లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. డచ్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్న మాక్సీ కేవలం 40 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఏకంగా 252.50 స్ట్రైక్‌రేటుతో 101 పరుగులు సాధించి వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా వైస్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కాగా ప్రపంచకప్‌-2023లో ఢిల్లీలోనే మార్కరమ్‌ 49 బంతుల్లో శతకం సాధించిన విషయం తెలిసిందే.

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement