Hashmatullah Shahidi: ఆఫ్గానిస్తాన్‌ నుంచి వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక ఫిప్టి ప్లస్‌ స్కోర్లు, సరికొత్త రికార్డు సృష్టించిన కెప్టెన్‌ హష్మతుల్లా షాహిదీ 

ఆఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహిదీ వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక ఫిప్టి ప్లస్‌ స్కోర్లు సాధించిన ఆఫ్గాన్‌ క్రికెటర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో​ భాగంగా ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన హష్మతుల్లా షాహిదీ.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

Hashmatullah-Shahidi (Photo-X)

ఆఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహిదీ వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక ఫిప్టి ప్లస్‌ స్కోర్లు సాధించిన ఆఫ్గాన్‌ క్రికెటర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో​ భాగంగా ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన హష్మతుల్లా షాహిదీ.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో షాహిదీ 3సార్లు 50కి పైగా పరుగులు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఆఫ్గాన్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ నజీబుల్‌ జర్డాన్‌(2సార్లు) పేరిట ఉండేది. అదే విధంగా వరల్డ్‌కప్‌లో ఫిప్టీ ఫ్లస్ స్కోర్‌ సాధించిన తొలి ఆఫ్గాన్‌ కెప్టెన్‌గా కూడా షాహిదీ రికార్డులకెక్కాడు. ఇక టీమిండియాతో మ్యాచ్‌లో 88 బంతులు ఎదుర్కొన్న షాహిదీ 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 80 పరుగులు చేశాడు.

Hashmatullah-Shahidi (Photo-X)

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now