Abrar Ahmed: గిల్‌ను ఔట్‌ చేశాక పాక్‌ బౌలర్‌ ఓవరాక్షన్‌ వీడియో ఇదిగో, ఇక బ్యాగ్ సర్దుకుని మీ దేశం వెళ్లు అంటూ ఘాటుగా రిప్లై ఇస్తున్న భారత అభిమానులు

ఛాంపియన్ ట్రోఫీలో భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో పాక్‌ యువ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ ఓవర్ యాక్షన్ వీడియో వైరల్ అవుతోంది. దీంతో భారత క్రికెట్‌ అభిమానుల నుంచి తిట్ల దండకాన్ని అందుకుంటున్నాడు.

Abrar Ahmed (Photo Credits: @JioHotstar)

ఛాంపియన్ ట్రోఫీలో భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో పాక్‌ యువ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ ఓవర్ యాక్షన్ వీడియో వైరల్ అవుతోంది. దీంతో భారత క్రికెట్‌ అభిమానుల నుంచి తిట్ల దండకాన్ని అందుకుంటున్నాడు. భారత్‌, పాకిస్తాన్‌ జట్లు నిన్న (ఫిబ్రవరి 23) దుబాయ్‌లో తలపడిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అబ్రార్‌ అహ్మద్‌ అతి చేశాడు. పాక్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్‌ సాఫీగా ఛేదిస్తుండగా.. శుభ్‌మన్‌ గిల్‌ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. గిల్‌ను అబ్రార్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

వీడియో ఇదిగో, ముందుకు పరిగెడుతూ సంచలన క్యాచ్ అందుకున్న సచిన్ టెండూల్కర్

గిల్‌ను ఔట్‌ చేశాక అబ్రార్‌ చేతులు కట్టుకుని నిలబడి 'వెళ్లు.. ఇక వెళ్లు.. వెళ్లి బ్యాగ్ సర్దుకో' అన్నట్టు సైగలు చేశాడు.దీంతో భారత్ అభిమానులు బ్యాగ్‌ సర్దుకోవాల్సింది గిల్‌ కాదు, మీరే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో విరాట్‌ సూపర్‌ సెంచరీతో కదంతొక్కడంతో పాక్‌పై భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్‌ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్‌ అహ్మద్‌, ఖుష్దిల్‌ షా తలో వికెట్‌ తీశారు. ఈ గెలుపుతో భారత్‌ సెమీస్‌ బెర్త్‌ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస పరాజయాలతో పాక్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

Abrar Ahmed Gives Send-Off to Shubman Gill

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now