Pakistan Squad For World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు పాకిస్తాన్ జట్టు ఇదిగో, స్టార్‌ పేసర్‌ నసీం షా గాయం కారణంగా దూరం, ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ రీ ఎంట్రీ

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.బాబర్‌ ఆజం సారథ్యంలో ప్రపంచ కప్ ఆడనుంది. వన్డేప్రపంచకప్‌కు ఆ జట్టు స్టార్‌ పేసర్‌ నసీం షా గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే ఆసియాకప్‌ మధ్యలో వైదొలిగిన స్టార్‌ పేసర్‌ హ్యారీస్‌ రవూఫ్‌ మాత్రం పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు.

Pakistan Squad For ICC Cricket World Cup 2023

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.బాబర్‌ ఆజం సారథ్యంలో ప్రపంచ కప్ ఆడనుంది. వన్డేప్రపంచకప్‌కు ఆ జట్టు స్టార్‌ పేసర్‌ నసీం షా గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే ఆసియాకప్‌ మధ్యలో వైదొలిగిన స్టార్‌ పేసర్‌ హ్యారీస్‌ రవూఫ్‌ మాత్రం పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. మరోవైపు ఆసియాకప్‌లో శ్రీలంకతో సూపర్‌-4 మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ కూడా తిరిగి ఎంట్రీ ఇచ్చాడు.

స్పిన్నర్‌ ఉస్మా మీర్‌, ఫాస్ట్‌బౌలర్‌ హసన్‌ అలీను పాక్‌ సెలక్టర్లు ఎంపిక చేశారు. గాయపడిన నసీం షా స్ధానంలో హసన్‌ అలీ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇక రిజర్వ్‌ జాబితాలో మహ్మద్‌ హ్యారిస్‌, జమాన్‌ ఖాన్‌, అర్బర్‌ అహ్మద్‌లకు చోటు దక్కింది. ఇక ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 6న హైదరాబాద్‌ వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడనుంది.

వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్‌ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్, అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌ కీపర్‌), మ వసీం జూనియర్, సౌద్ షకీల్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ షా ఆఫ్రిది, ఉసామా మీర్.

రిజర్వ్‌: మహ్మద్ హరీస్, జమాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్.

Here's Team

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement