T20 World Cup 2022:బంగ్లాదేశ్‌ బౌలర్లను ఊచకోత కోసిన రోసో, 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా

టీ20 ప్రపంచకప్‌-2022లో దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని నమోదు చేసింది. సూపర్‌-12లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం నమోదు చేసింది. 206 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 101 పరుగులకే కుప్పకూలింది.

South Africa Team (Photo-Twitter/ICC)

టీ20 ప్రపంచకప్‌-2022లో దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని నమోదు చేసింది. సూపర్‌-12లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం నమోదు చేసింది. 206 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 101 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్‌ బౌలర్లలో నోర్జే నాలుగు వికెట్లతో బంగ్లాదేశ్‌ పతనాన్ని శాసించగా.. షాంసీ మూడు, రబాడ, మహారాజ్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా.. రోసో అద్భుత శతకానికి(109 తోడు.. డికాక్‌ హాఫ్‌ సెంచరీ(63)తో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now