ICC World Cup 2023: హైదరాబాద్ టీమిండియా అభిమానులకు తీవ్ర నిరాశే, ఉప్పల్ స్టేడియంలో భారత్ మ్యాచ్ ఒక్కటి కూడా లేదు
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నప్పటికీ టీమిండియా మాత్రం ఒక మ్యాచ్ కూడా ఆడడం లేదు. లీగ్ స్టేజ్‌లో భారత జట్టు 9 మ్యాచ్‌లు ఆడనుండగా.. 9 వేర్వేరు వేదికలపై ఆడనుంది.
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న సంగతి విదితమే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
హైదరాబాద్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నప్పటికీ టీమిండియా మాత్రం ఒక మ్యాచ్ కూడా ఆడడం లేదు. లీగ్ స్టేజ్‌లో భారత జట్టు 9 మ్యాచ్‌లు ఆడనుండగా.. 9 వేర్వేరు వేదికలపై ఆడనుంది. కానీ అందులో మన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం లేదు. ఒక వేళ భారత జట్టు సెమీ ఫైనల్, ఫైనల్ చేరినప్పటికీ టీమిండియాను హైదరాబాద్‌లో చూసే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లను హైదరాబాద్‌లో నిర్వహించడం లేదు.
BCCI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)