IML 2025: సచిన్ విధ్వంసం.. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, ఫోర్లు- సిక్సర్లతో ఆస్ట్రేలియాపై విరుచుకపడ్డ సచిన్, కానీ!

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ విధ్వంసం సృష్టించాడు(IML 2025). 51 ఏళ్ల వయసులోనూ వారెవ్వా అనిపించాడు. ఆస్ట్రేలియా మాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు సచిన్.

IML 2025 Sachin Tendulkar's blistering fifty in 27 Balls(X)

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ విధ్వంసం సృష్టించాడు(IML 2025). 51 ఏళ్ల వయసులోనూ వారెవ్వా అనిపించాడు. ఆస్ట్రేలియా మాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు సచిన్. కేవలం 33 బంతుల్లో 64 పరుగులు చేశాడు. 27 బంతుల్లోనే అర్థసెంచరీ చేయడం విశేషం.

మాస్టర్ బ్లాస్టర్ తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ ఓటమి పాలైంది(International Masters League). ఆస్ట్రేలియా నిర్దేశించిన 270 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇండియా మాస్టర్స్ సాధించలేకపోయింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా మాస్టర్స్ 174 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ ఓడినా ఇండియా మాస్టర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉంది.

క్రిస్ గేల్ అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, ఐసీసీ వన్డే ఈవెంట్స్ చరిత్రలో 65 సిక్సర్లు బాదిన భారత కెప్టెన్ 

ఆస్ట్రేలియా మాస్టర్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ 52 బంతుల్లో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 12 ఫోర్లు, 7 సిక్సర్లు వాట్సన్ రాణించగా బెన్ డంక్ కూడా సెంచరీ సాధించాడు. బెన్ డంక్ 53 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 132 పరుగులు చేశాడు.

Sachin blistering fifty in 27 Balls 

Sachin Tendulkar's blistering fifty in 27 Balls 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement