IND vs AUS 3rd Test 2023: రెండో ఇన్నింగ్స్‌లో చెత్తగా ఆడిన బ్యాటర్లు, ఆస్ట్రేలియాకు 76 పరుగుల లక్ష్యాన్ని విధించిన భారత్, 8 వికెట్లతో నాథన్ లయన్ ఇండియాపై సరికొత్త రికార్డు

తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో163 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 76 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

Australian-players-celebrate-a-wicket

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మూడో టెస్టులో భారత్ చతికిల పడింది. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో163 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 76 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.ఆసీస్ బౌలర్ నాథన్ లయన్(Nathan Lyon) భారత్‌ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఏకంగా 8 వికెట్లు పడగొట్టి భారత్‌పై సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఆస్ట్రేలియా 197 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 156/4తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆసీస్ మరో 41 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటయ్యారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)