Virat Kohli Bowling Video: విరాట్ కోహ్లి బౌలింగ్ వీడియో ఇదిగో, మూడు బంతులు వేసి రెండు పరుగులు ఇచ్చిన టీమిండియా స్టార్
వేసిన మూడు బంతుల్లో రెండు పరుగులు ఇచ్చాడు. కథ ఏంటంటే..బంగ్లా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ సందర్భంగా.. భారత జట్టు సారథి రోహిత్ శర్మ.. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేతికి బంతినిచ్చాడు.
వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి బాల్‌తో రంగంలోకి దిగాడు. వేసిన మూడు బంతుల్లో రెండు పరుగులు ఇచ్చాడు. కథ ఏంటంటే..బంగ్లా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ సందర్భంగా.. భారత జట్టు సారథి రోహిత్ శర్మ.. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేతికి బంతినిచ్చాడు. ఈ క్రమంలో పాండ్యా బౌలింగ్‌లో తొలి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయిన లిటన్ దాస్ మరుసటి రెండు బంతుల్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అయితే, రెండోసారి బౌండరీ దిశగా వెళ్తున్న బంతిని ఆపే క్రమంలో పాండ్యా తన కుడికాలిని అడ్డుపెట్టాడు. ఈ క్రమంలో పట్టుతప్పి జారిపడిపోయాడు.
పాండ్యా నొప్పితో విలవిల్లాడటంతో.. ఓవర్ పూర్తి చేసేందుకు రోహిత్ శర్మ.. కోహ్లిని పిలిచాడు. ఇక పాండ్యా ఓవర్లో మిగిలిన మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు కోహ్లీ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వన్డేల్లో ఆఖరిసారిగా.. 2017లో శ్రీలంకతో మ్యాచ్‌లో కోహ్లి బౌలింగ్ చేశాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)