ICC Under-19 cricket World Cup: టీమిండియాలో కరోనా కలకలం, అండర్ -19 కెప్టెన్, వైస్ కెప్టెన్ సహా ఆరుగురికి సోకిన వైరస్, ఐర్లాండ్‌తో మ్యాచ్ కు దూరమైన ఆటగాళ్లు

అండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్న భారత యువ జట్టులో కరోనా కలకలం రేపింది. కెప్టెన్ యశ్ ధుల్‌, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌ సహా మొత్తం ఆరుగురు భారత క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వీరంతా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు దూరమయ్యారు.

TAROUBA January 19: అండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్న భారత యువ జట్టులో కరోనా కలకలం రేపింది. కెప్టెన్ యశ్ ధుల్‌, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌ సహా మొత్తం ఆరుగురు భారత క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వీరంతా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు దూరమయ్యారు. కెప్టెన్ యశ్ ధుల్‌ గైర్హాజరీలో ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు నిశాంత్ సంధు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఐర్లాండ్‌ తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యువ భారత్‌.. 40 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు రఘువంశీ(79), హర్నూర్‌ సింగ్‌(88) శుభారంభాన్ని అందించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement