KL Rahul Catch Video: గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టిన కేఎల్‌ రాహుల్‌, వాట్‌ ఏ క్యాచ్‌ అంటూ ట్వీట్ చేసిన బీసీసీఐ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో కేఎల్‌ రాహుల్‌ సంచలన క్యాచ్‌తో మెరిసి మరోసారి వార్తల్లో నిలిచాడు.గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకుని కీలక వికెట్‌ కూల్చడంలో తన వంతు పాత్ర పోషించాడు

Kl Rahul Catch Video (Photo-Video Grab)

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో కేఎల్‌ రాహుల్‌ సంచలన క్యాచ్‌తో మెరిసి మరోసారి వార్తల్లో నిలిచాడు.గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకుని కీలక వికెట్‌ కూల్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా(81) అద్భుత పోరాటం చేశాడు.ప్రమాదకరంగా మారుతున్న అతడిని టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా.. అద్భుత బంతి(45.5 ఓవర్‌)తో బోల్తా కొట్టించాడు. జడ్డూ వేసిన బాల్‌ను రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడబోయిన ఖవాజా ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్‌ ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన బీసీసీఐ.. వాట్‌ ఏ క్యాచ్‌ అంటూ రాహుల్‌ను కొనియాడింది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement