T20 World Cup 2022: అక్టోబ‌ర్ 23న ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్, హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో దాయాదులపై భారత్ కసి తీర్చుకుంటుందా..

అక్టోబ‌ర్ 23వ తేదీన ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌కు చెందిన టికెట్లు అన్నీ అమ్ముడుపోయిన‌ట్లు ఐసీసీ తెలిపింది. అద‌న‌పు స్టాండింగ్ రూమ్ టికెట్లు కూడా క్ష‌ణాల్లో సేల్ అయిన‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది.

India and Pakistan players shake hands after their Super 4 match (Photo credit: Twitter)

అక్టోబ‌ర్ 23వ తేదీన ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌కు చెందిన టికెట్లు అన్నీ అమ్ముడుపోయిన‌ట్లు ఐసీసీ తెలిపింది. అద‌న‌పు స్టాండింగ్ రూమ్ టికెట్లు కూడా క్ష‌ణాల్లో సేల్ అయిన‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది. ఆస్ట్రేలియాలో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం ఇప్ప‌టికే 5 ల‌క్ష‌ల టికెట్లు అమ్ముడుపోయిన‌ట్లు తెలుస్తోంది. వ‌య‌సుతోటి, బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేకుండా అభిమానులంద‌రికీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు ఐసీసీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు 82 దేశాల‌కు చెందిన అభిమానులు వ‌రల్డ్‌క‌ప్ మ్యాచ్‌ల‌ను వీక్షించేందుకు టికెట్లు కొన్న‌ట్లు ఐసీసీ చెప్పింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement