Virat Kohli Wicket Video: విరాట్ కోహ్లీ ఔటైన వీడియో చూసి మళ్లీ అభిమానుల గుండె పగిలింది, ఈ సారి కూడా సచిన్ రికార్డును చేరుకోలేకపోయిన విరాట్
కానీ మధుశంక భారత అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. అతడు వేసిన 32వ ఓవర్లో మూడో స్లో బంతిని ముందు పుష్ చేయబోయిన కోహ్లీ.. షాట్ కవర్ వద్ద పతుమ్ నిస్సంకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా వాంఖడే వేదికగా భారత్-శ్రీలంక జట్లు తలపడతున్నాయి.ఈ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌లు సెంచరీలు మిస్ చేసుకున్నారు. శతకాల దిశగా సాగిన ఈ ఇద్దరూ.. కీలక సమయంలో నిష్క్రమించారు.గిల్ ఔట్ అయిన తర్వాత కోహ్లీ అయినా సెంచరీ చేస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.
కోహ్లీ శతకానికి చేరువగా రావడంతో వాంఖెడేలో సచిన్ ఎదుట అతడి వన్డే సెంచరీల (49) రికార్డును కోహ్లీ సమం చేస్తాడని అంతా ఆశించారు. కానీ మధుశంక భారత అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. అతడు వేసిన 32వ ఓవర్లో మూడో స్లో బంతిని ముందు పుష్ చేయబోయిన కోహ్లీ.. షాట్ కవర్ వద్ద పతుమ్ నిస్సంకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 94 బంతులాడిన కోహ్లీ.. 11 బౌండరీల సాయంతో 88 పరుగులు చేశాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)