Dhruv Jurel Stunning Run Out: భారత్ వికెట్ కీపర్ మెరుపు వేగంతో రనౌట్ చేసిన వీడియో ఇదిగో, ఇంగ్లండ్ కుప్పకూలడానికి కారణం ఇదే, 4 పరుగులతో పెవిలియన్ చేరిన బెన్ డకెట్
భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (6.1వ ఓవర్లో) బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా బంతిని తరలించగా.. మహ్మద్ సిరాజ్ బాల్‌ను ఆపాడు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న జాక్ క్రాలే పరుగుకు నిరాకరించగా.. డకెట్ వెంటనే వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు.
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఏకంగా 434 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత టెస్టు చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(214)కు తోడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(5 వికెట్లు) బంతితో మాయాజాలం చేయడంతో ఈ గెలుపు సాధ్యమైంది.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రమాదకర బ్యాటర్, ఓపెనర్ బెన్ డకెట్(4)ను వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ రనౌట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (6.1వ ఓవర్లో) బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా బంతిని తరలించగా.. మహ్మద్ సిరాజ్ బాల్‌ను ఆపాడు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న జాక్ క్రాలే పరుగుకు నిరాకరించగా.. డకెట్ వెంటనే వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే సిరాజ్ వేసిన బంతిని అందుకున్న వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మెరుపు వేగంతో స్టంప్‌ను ఎగురగొట్టాడు.డకెట్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. డకెట్ తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసకర శతకం(153)తో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Here's Video