IPL Auction 2025 Live

Asian Games 2023: ఏసియన్స్ గేమ్స్‌లో టీమిండియా కొత్త చరిత్ర, క్రికెట్‌లో మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌చ సొంతం చేసుకున్న అండర్ 19 మహిళలు

ఛేదనలో తడబడిన శ్రీలంక లక్ష్యానికి 20 పరుగుల దూరంలో నిలిచిపోయి రజతంతో సరిపెట్టుకుంది. టీమిండియా మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.

India Women's Cricket Team

ఏషియన్‌ గేమ్స్‌ మహిళల క్రికెట్‌ ఈవెంట్‌లో శ్రీలంకతో ఇవాళ (సెప్టెంబర్‌ 25) జరిగిన ఫైనల్లో భారత్‌ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వర్ణం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక లక్ష్యానికి 20 పరుగుల దూరంలో నిలిచిపోయి రజతంతో సరిపెట్టుకుంది. టీమిండియా మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.

కాంస్య పతకం కోసం ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇవాళ ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ తొలి స్వర్ణం కైవసం చేసుకుంది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌లతో కూడిన జట్టు భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది.

India Women's Cricket Team

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)