Asia Cup 2023: భారత జట్టు పాకిస్తాన్ కు వెళ్లే ప్రసక్తే లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ కార్యదర్శి జై షా

కాగా 2023 ఆసియా కప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం ఉన్న పాకిస్థాన్‌కు భారత్ వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి.

Jay Shah Refused to Hold Indian National Flag

పాకిస్తాన్‌ వేదికగా వచ్చే ఏడాది (2023) సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్‌ వన్డే టోర్నీలో (2023 Asia Cup) భారత్‌ పాల్గొనేది లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా 2023 ఆసియా కప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం ఉన్న పాకిస్థాన్‌కు భారత్ వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పోటీల కోసం జట్టు పాకిస్థాన్‌కు వెళ్లడం లేదని, తటస్థ వేదికను నిర్ణయిస్తామని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా తెలిపారు. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ రెండు జట్లు 15 ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. 50 ఓవర్ల ఆసియా కప్ కోసం భారత్ 2008లో పాకిస్థాన్‌కు వెళ్లింది.