IPl 2022: 145 కి.మీ.ల వేగంతో దుష్మంత చమీరా యార్కర్, తొలి బంతికే క్లీన్‌ బౌల్డ్‌ అయిన విజయ్‌ శంకర్‌, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Dushmantha Chameera clean bowls Vijay Shankar with a 145 kmph yorker (Photo/IPL Twitter)

ఐపీఎల్‌-2022లో భాగంగా మార్చి 28న జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ దుష్మంత చమీరా అద్భుతమైన యార్కర్‌తో గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్‌ విజయ్‌ శంకర్‌ను పెవిలియన్‌కు పంపాడు. గుజరాత్‌ ​ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ వేసిన చమీరా తొలి బంతికే విజయ్‌ శంకర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అయితే 145 కి.మీ.ల వేగంతో చమీరా వేసిన యార్కర్‌కు శంకర్‌ వద్ద సమాధానమే లేకుండా పోయింది. . దీంతో శంకర్‌(6 బంతుల్లో 4 పరుగులు) నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ టైటాన్స్‌ బోణీ కొట్టింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement