IPL 2022: నువ్వేం కెప్టెన్‌వి పాండ్యా, ముందు ధోనీ లాగా కూల్ గా ఉండటం నేర్చుకో, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీరుపై మండిపడుతున్న నెటిజన్లు
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. హార్దిక్‌లో నాయకుడి లక్షణాలు లేవని, జట్టు సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం సరికాదని విమర్శిస్తున్నారు.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. హార్దిక్‌లో నాయకుడి లక్షణాలు లేవని, జట్టు సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం సరికాదని విమర్శిస్తున్నారు. ఐపీఎల్-2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్ సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడింది. 13వ ఓవర్‌లో స్వయంగా రంగంలోకి దిగిన హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఓవర్ రెండు, మూడో బంతుల్లో విలియమ్సన్ వరుస సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్‌కు వరుసగా రెండు, ఒక పరుగు వచ్చాయి. ఈ క్రమంలో స్ట్రైక్ తీసుకున్న త్రిపాఠి అప్పర్ కట్ షాట్ ఆడాడు. అది కాస్త డీప్ థర్డ్ మ్యాన్ దిశగా బంతి దూసుకుపోయింది.
అయితే, అక్కడే ఉన్న మహ్మద్ షమీ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. అతడు కాస్త ముందుకు వస్తే వికెట్ దొరికే అవకాశం ఉండేది. కానీ వెనక్కి జరిగిన షమీ బంతిని అందుకుని బ్యాటర్‌కు ఎక్కువ పరుగులు దొరకకుండా అడ్డుకట్ట వేశాడు. దీంతో క్యాచ్ మిస్ అయినా, సన్‌రైజర్స్‌కు ఒకే ఒక్క పరుగు వచ్చింది. అయితే, షమీ క్యాచ్ డ్రాప్ చేయడంతో హార్దిక్ పాండ్యా సహనం కోల్పోయాడు. అతడి మీదకు అరుస్తూ అసహనం ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నువ్వు.. టీమిండియాలో సీనియర్ అయిన షమీ మీదకు అరుస్తావా? కెప్టెన్ అయ్యానని అహంకారమా? తను క్యాచ్ పట్టకపోయి ఉండవచ్చు.. పరుగులు సేవ్ చేశాడు కదా! అసలు నీకు కెప్టెన్‌గా ఉండే అర్హత లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)