IPL 2022 Retention: రూ. 16 కోట్లతో రోహిత్‌‌ను రీటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్, రూ. 15 కోట్లతో విరాట్‌ కోహ్లిను రీటైన్ చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ముంబై ఇండియన్స్ జట్టు రూ. 16 కోట్లతో రోహిత్‌ను రీటైన్ చేసుకుంది. 12 కోట్లతో బుమ్రాను, రూ. 8 కోట్లతో సూర్యకుమార్ యాదవ్‌ను, రూ. 6 కోట్లతో పొలార్డ్‌ను రీటైన్ చేసుకుంది

India vs New Zealand 2rd T20; Rohit Sharma- Super Over. | Photo: BCCI

తమ దగ్గర అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమర్పించాయి. ముంబై ఇండియన్స్ జట్టు రూ. 16 కోట్లతో రోహిత్‌ను రీటైన్ చేసుకుంది. 12 కోట్లతో బుమ్రాను, రూ. 8 కోట్లతో సూర్యకుమార్ యాదవ్‌ను, రూ. 6 కోట్లతో పొలార్డ్‌ను రీటైన్ చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్‌ కోహ్లి, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మహ్మద్ సిరాజ్‌ను రీటైన్‌ చేసుకుంది. విరాట్‌ కోహ్లిను అత్యధికంగా 15 కోట్లు వెచ్చించి రిటైన్‌ చేసుకున్నారు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ని 11 కోట్లు, మహ్మద్ సిరాజ్‌కు 7 కోట్లు వెచ్చించారు. కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 42 కోట్లు వెచ్చించి ధోనీ సహా నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకొంది. అయితే, తొలి ప్రాధాన్య ఆటగాడిగా జడేజాను ఎంచుకోవడంతో ధోనీ కంటే రూ. 4 కోట్లు జడ్డూకు అదనంగా ముట్టనుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)