IPL 2022: ఐపీఎల్ చరిత్రలో శిఖర్ ధావన్ సరికొత్త రికార్డు, 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా ఘనత, తరువాతి స్థానంలో డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ
ఐపీఎల్ చరిత్రలో 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా ఘనత సాధించాడు. ఐపీఎల్ 2022 చివరి లీగ్ మ్యాచ్‌లో ధావన్ ఈ మైలురాయిని అందుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా ఘనత సాధించాడు. ఐపీఎల్ 2022 చివరి లీగ్ మ్యాచ్‌లో ధావన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శిఖర పేరిట ఐపీఎల్‌లో ఇప్పుడు మొత్తం 701 ఫోర్లు ఉన్నాయి. అతని తర్వాత జాబితాలో డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇప్పటి వరకు వార్నర్ 577, కోహ్లీ 576 ఫోర్లు కొట్టారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాటర్‌గా ధవన్ నిలిచాడు. అతను ఇప్పటి వరకు 6244 రన్స్ చేశాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)