IPL 2022: ధోనీ స్థాయి ఏంటీ, నీ స్థాయి ఏంటీ కోహ్లీ, గురువు అవుటైతే ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా, కోహ్లి సెలబ్రేట్ తీరుపై మండిపడుతున్న ఫ్యాన్స్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఐపీఎల్-2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ మధ్య బుధవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ‘ఫినిషర్’ ధోని 19వ ఓవర్ మొదటి బంతికే జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ సందర్బంగా కోహ్లి సెలబ్రేట్ చేసుకున్న విధానమే అతడిపై విమర్శలకు కారణమైంది.
ఐపీఎల్-2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ మధ్య బుధవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ‘ఫినిషర్’ ధోని 19వ ఓవర్ మొదటి బంతికే జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ సందర్బంగా కోహ్లి సెలబ్రేట్ చేసుకున్న విధానమే అతడిపై విమర్శలకు కారణమైంది. కోహ్లి అభ్యంతరకర భాష వాడుతూ సెలబ్రేట్ చేసుకున్నట్లుగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో.. ‘‘గురువు లాంటి ధోని పట్ల నీకున్న గౌరవం ఇదా! అసలు ఏమనుకుంటున్నావు? నీ తప్పిదం వల్ల రనౌట్ జరిగింది. ఊతప్ప వేసిన బంతిని ఒడిసిపట్టి ధోని మాక్సీని అవుట్ చేశాడు. ఆటను ఆటగా చూడాలే తప్ప భావోద్వేగాలు.. అది కూడా మరీ ఇంత నీచంగా ప్రదర్శించాలా?’’ అంటూ నెటిజన్లు కోహ్లిని ఏకిపారేస్తున్నారు. నీ నుంచి ఇలాంటి చెత్త ప్రవర్తన ఊహించలేదు’’ అని... నీ ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి సిగ్గు పడే పరిస్థితి తెచ్చావంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇందులో కొంతమంది కోహ్లి ఫ్యాన్స్ కూడా ఉండటం విశేషం.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)