IPL 2023: విరాట్ కోహ్లీని మళ్లీ గెలికిన నవీన్ ఉల్ హక్, ఎగతాళి చేస్తూ వీడియో పోస్ట్, నీవు అస్సలు మనిషివేనా అంటూ మండిపడుతున్న ఆర్సీబీ ఫ్యాన్స్
ఐపీఎల్-2023లో ప్లేఆఫ్ రేసులో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది.దీంతో ఈ ఏడాది క్యాష్‌రిచ్ లీగ్ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో ఆర్సీబీ ఓటమి పాలవ్వగానే.. నవీన్ ఉల్ హక్ తన ఇనాస్టాగ్రామ్‌లో ఓ క్రిప్టిక్ స్టోరీ పోస్టు చేశాడు.
ఐపీఎల్-2023లో ప్లేఆఫ్ రేసులో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది.దీంతో ఈ ఏడాది క్యాష్‌రిచ్ లీగ్ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో ఆర్సీబీ ఓటమి పాలవ్వగానే.. నవీన్ ఉల్ హక్ తన ఇనాస్టాగ్రామ్‌లో ఓ క్రిప్టిక్ స్టోరీ పోస్టు చేశాడు. అది కోహ్లితో పాటు ఆర్సీబీ జట్టును ఎగతాళి చేసినట్లు ఉంది. అయితే కోహ్లిని హేళన చేసిన నవీన్ ఉల్‌హక్‌ను ఆర్సీబీ ఫ్యాన్స్ ఓ ఆటాడేసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలు చేస్తున్నారు. చీ మరి ఇంత దారుణమా.. నీవు అస్సలు మనిషివేనా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, నవీన్ ఉల్‌హక్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని కోహ్లి అక్కడితోనే విడిచి పెట్టగా.. నవీన్ ఉల్ హక్ మాత్రం ఏదో విధంగా విరాట్‌ను గెలుకుతున్నాడు. తాజాగా నవీన్ మరోసారి ఇలా వంకర బుద్ధిని చాటుకున్నాడు.
Video