IPL 2023: వీడియో ఇదిగో, మహ్మద్ సిరాజ్ ఇన్‌స్వింగర్ దెబ్బకు బిత్తరపోయిన బట్లర్, మిడిల్ స్టంప్‌ను ఎగురగొట్టిన బంతి
ఐపీఎల్ 16వ సీజన్‌లో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ఫామ్ తో దూసుకుపోతున్నాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికి డేంజరస్ బ్యాటర్ జాస్ బట్లర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే బట్లర్‌ను ఔట్ చేసిన విధానం సిరాజ్ ఎంత మెరుగయ్యాడనేది చూపిస్తోంది.
ఐపీఎల్ 16వ సీజన్‌లో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ఫామ్ తో దూసుకుపోతున్నాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికి డేంజరస్ బ్యాటర్ జాస్ బట్లర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే బట్లర్‌ను ఔట్ చేసిన విధానం సిరాజ్ ఎంత మెరుగయ్యాడనేది చూపిస్తోంది. రైట్ హ్యాండ్ బ్యాటర్లకు ఔట్‌స్వింగర్ వేసే సిరాజ్.. బట్లర్‌కు మాత్రం ఇన్‌స్వింగర్ వేసి బోల్తా కొట్టించాడు. ఔట్‌సైడ్ వెళ్తుందని భావించిన బట్లర్ బంతిని ఢిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించడంతో బంతి వెళ్లి నేరుగా మిడిల్ స్టంప్‌ను ఎగురగొట్టింది. సిరాజ్ దెబ్బకు బట్లర్ వద్ద సమాధానం లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇదే..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)