IPL 2023: శుభమాన్ గిల్ సిక్స్ వీడియో, స్టేడియంలోనే నేల మీద పడుకుని ఏడ్చేసిన మహమ్మద్ సిరాజ్, డగౌట్‌లో కూర్చోని కంటతడి పెట్టిన కోహ్లీ
తద్వారా ప్లే ఆఫ్స్ రేసు నుంచి బెంగళూరు నిష్క్రమించగా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.
ఐపీఎల్-2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసు నుంచి బెంగళూరు నిష్క్రమించగా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టడంతో ఆర్సీబీ ఆటగాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్ మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యారు. గిల్ సిక్స్ కొట్టి గుజరాత్‌ను గెలిపించగానే.. మహ్మద్ సిరాజ్ ఒక్క సారిగా మైదానంలో నేలపై పడి కన్నీరు పెట్టుకున్నాడు.అదే విధంగా కోహ్లి కూడా డగౌట్‌లో కూర్చోని కంటతడి పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)